: మూడోస్థానానికి పడిపోయిన కోహ్లీ
టీమిండియా యువకెరటం విరాట్ కోహ్లీ ఐసీీసీ వన్డే ర్యాంకుల్లో మూడోస్థానానికి పడిపోయాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో కోహ్లీ ఓ స్థానం పతనమయ్యాడు. సఫారీ బ్యాట్స్ మన్ హషీమ్ ఆమ్లా రెండోస్థానానికి ఎగబాకాడు. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఆరోస్థానాన్ని నిలుపుకోగా, దక్షిణాఫ్రికా యోధుడు ఏబీ డివిలీర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ స్థానం పతనమై తొమ్మిదో స్థానంలో నిలిచాడు.