: ఈ రోజు కేసీఆర్ ను కలుస్తున్నా: సానియా మీర్జా


తనకు టెన్నిస్ తప్ప మరేదీ పట్టదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. ఈ ఏడాది తనకు బాగా కలిసొచ్చిందని... అనేక విజయాలు నమోదు చేశానని వెల్లడించింది. తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. తన విజయాల వెనుక ఎలాంటి రహస్యాలు లేవని... గత 21 ఏళ్లుగా కష్టపడుతున్నానని చెప్పింది. టెన్నిస్ లో అగ్రస్థానంలో నిలవాలన్నదే తన ధ్యేయమని వెల్లడించింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం చాలా గొప్పదని... అందరూ అందులో పాల్గొనాలని సూచించింది. ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలుస్తున్నానని చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News