: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల తొలి దశకు నోటిఫికేషన్ విడుదల


జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తొలి దశ పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం వచ్చే నెల 25న జమ్మూ కాశ్మీర్ లో 15 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ ను ఈ నెల 29న జారీ చేయాలని తొలుత భావించినప్పటికీ, ఆ రోజు సెలవు ఉన్న నేపథ్యంలో మంగళవారమే నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 5 లోగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. నవంబర్ 7న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 10తో గడువు ముగియనుంది.

  • Loading...

More Telugu News