: తుపాను బాధితులకు బాలయ్య అభిమానుల ఆసరా
మా అభిమాన హీరోకు మేమేమీ తీసిపోమంటున్నారు బాలయ్య అభిమానులు. తమ అభిమాన హీరో తరహాలోనే వారూ తుపాను బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన బాలయ్య అభిమానులు రూ.2 లక్షల విరాళాలను సేకరించారు. దీనికి సంబంధించిన చెక్కును వారు మంగళవారం హైదరాబాద్ లో బాలకృష్ణకు అందజేశారు.