: తుపాను వల్ల వైద్యఆరోగ్య శాఖకు వంద కోట్ల నష్టం: మంత్రి కామినేని


హుదూద్ తుపాను వల్ల ఏపీ వైద్యఆరోగ్య శాఖకు వంద కోట్ల నష్టం వాటిల్లిందని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. డిసెంబరు నుంచి ప్రభుత్వాసుపత్రులలో పీపీపీ (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానాన్ని అమలుచేస్తామన్నారు. ప్రయోగాత్మకంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియోథెరపిక్ విభాగాన్ని అదే పద్ధతిలో ప్రారంభిస్తామని వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో అన్ని ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తామని చెప్పిన మంత్రి, ఇకపై ఉద్యోగులందరూ సమయానికి రావాలని స్పష్టం చేశారు. రాష్ట్రం అంతటా త్వరలో వెయ్యి జెనరిక్ ఔషధ దుకాణాలు ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. వాటి ద్వారా పేదలకు అతి తక్కువ ధరలకే మందులు అందిస్తామన్నారు. అటు డిసెంబర్ 1 నుంచి జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు జారీ చేస్తామని, ఈ నెల 30న ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను పంపిణీ చేయనున్నట్లు కామినేని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News