: అమెరికాలో తాగుబోతు ఘనకార్యం!
కొన్నేళ్ళ క్రితం మద్యపానంపై తీవ్ర వ్యతిరేకత ఉండేది! నేటి కాలంలో పరిమితంగా పుచ్చుకోవడంపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావడంలేదు. మితిమీరి తాగితేనే చిక్కులన్నీ! అమెరికాలో ఓ తాగుబోతు ఎలాంటి ఘనకార్యం చేశాడో చూడండి. కనెక్టికట్ లోని క్లింటన్ నగర వాసి టైలర్ సల్లివాన్ (26) బాగా మందేసుకుని, ఆ కిక్కులో తన ఇంటిని గుర్తించలేకపోయాడు. మరో ఇంట్లోకి వెళ్ళి వారి బెడ్ పై పవళించాడు. దీంతో, హడలిపోయిన ఆ ఇంటి యజమాని బయటికి వెళ్ళిపోవాలని అతడికి సూచించాడు. అయితే, మద్యం కిక్కు తలకెక్కిన సల్లివాన్ అందుకు నిరాకరించాడు. పోలీసులకు సమాచారమందించగా, వారు వచ్చి సల్లివాన్ ను అరెస్టు చేశారు. విచారణలో, అది తన తల్లి నివాసం అనుకున్నానని తెలిపాడా మందుబాబు. ప్రస్తుతం సల్లివాన్ బెయిల్ పై బయటికొచ్చాడు.