: మోదీని బ్రిటన్ కు ఆహ్వానించిన డేవిడ్ కామెరాన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆతిథ్యం ఇచ్చేందుకు బ్రిటన్ చాలా ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఈ మేరకు ఆంగ్ల ఛానల్ 'సీఎన్ఎన్-ఐబీఎన్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ మాట్లాడుతూ, మోదీ తమ దేశానికి రావాలని బహిరంగంగా ఆహ్వానించారు. "మోదీకి మా దేశం తరపున బహిరంగ ఆహ్వానం ఉంది. మా డిప్యూటీ పీఎం, ఛాన్సెలర్, విదేశాంగ మంత్రి అందరూ భారత్ కు వచ్చారు. ప్రధానమంత్రి మోదీని కలిశారు. నేను కూడా మూడుసార్లు ప్రధాని హోదాలో ఇండియాలో పర్యటించాను. భవిష్యత్తులోనూ పర్యటించాలని ఆశిస్తున్నా. బ్రిటన్ వచ్చేందుకు భారత్ పీఎంకు బహిరంగంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఆయన వస్తే సాదరంగా ఆహ్వానం పలుకుతాం" అని కామెరాన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో జమ్మూకాశ్మీర్ అంశంపై స్పందించిన కామెరాన్, ఈ విషయంలో బ్రిటన్ అస్సలు జోక్యం చేసుకోదన్నారు.