: మీ ఇంటి ముందు నిలబడే బానిసను కాలేను: జగన్ కు కొణతాల ఘాటు లేఖ


వైకాపా ఆవిర్భవించక ముందు నుంచి జగన్ వెన్నంటి ఉండి, పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేసిన నేత కొణతాల రామకృష్ణ. వైకాపా బలోపేతం కోసం నిర్విరామ కృషి చేసిన కొణతాల... ఇప్పుడు ఆ పార్టీనే వీడటానికి సిద్ధమయ్యారు. అంతేకాదు, అధినేత జగన్ కు ఘాటు లేఖను కూడా సంధించారు. "నా ఆత్మగౌరవంతో మీరు ఆడుకున్నారు. అడుగడుగునా అవమానించారు. మిమ్మల్ని తృప్తి పరచడం కోసం... మీ ఇంటి ముందు నిలబడే బానిసను కాలేను. ఇకపై మీరు చేసే అవమానాలను భరించలేను. అందుకే, మీరు నాకు ఇచ్చిన వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడి పదవికి రాజీనామా చేస్తున్నా. ఇప్పటికీ మీరు సంతృప్తి చెందకపోతే... పార్టీని వీడటానికి కూడా వెనుకాడను. పార్టీ నాయకత్వానికి కార్యకర్తలపై నమ్మకం లేదు. ఇలా ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ పోతే... చివరకు మిమ్మల్ని మీరే అనుమానించుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది" అంటూ లేఖలో తన ఆవేదనను, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కొణతాలతో పాటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. వీరంతా బీజేపీలో చేరుతారని సమాచారం.

  • Loading...

More Telugu News