: రైతుపై దాడి చేసిన అడవిపంది... పరిస్థితి విషమం
ఆదిలాబాద్ జిల్లాలో అడవిపందులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలో, జిల్లాలోని భైంసా మండలం వలేగాం గ్రామంలో చేనులో ఉన్న ఓ రైతుపై అడవిపంది దాడి చేసింది. ఈ ఘటనలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.