: భారత్ లోనే క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం: జియోమీ
భారతదేశంలోని కస్టమర్ల డేటా భద్రతకు ఇబ్బంది లేకుండా, వచ్చే ఏడాది ఇండియాలోనే క్లౌడ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ జియోమీ తెలిపింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జియోమీ ఉపాధ్యక్షుడు హ్యూగో బెర్రా మాట్లాడుతూ, అమెజాన్.కామ్ భాగస్వామ్యంతో కలసి నిర్వహించే ఈ డేటా సెంటర్ కు 'ఆపిల్ ఆఫ్ చైనా' అని పేరు కూడా ఖరారు చేశామన్నారు. చైనాకు సంబంధించిన కస్టమర్ల డేటాను యూఎస్, సింగపూర్ సర్వర్లకు తరలించే కార్యక్రమాన్ని జియోమీ ఇప్పటికే చేపట్టిందని ఆయన వివరించారు. భారత్ లో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా భారత్ లోని జియోమీ వినియోగదారుల భద్రతపై అనుమానాలు నివృత్తి చేయవచ్చని ఆయన తెలిపారు. జియోమీ ఫోన్లకు భారత్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.