: సీఎం ఎవరైనా మద్దతిస్తాం: శివసేన


మహారాష్ట్ర సీఎంగా బీజేపీ ఎవరిని ప్రతిపాదించినా తాము మద్దతిస్తామని శివసేన స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో తెలిపింది. శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పొత్తు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. రేపు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ జేపీ నద్దా కూడా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సీఎంను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News