: శివతత్వానికి ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీలో ప్రత్యేక చానల్


శివతత్వానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ సర్కారు నడుం బిగించింది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఎస్వీబీసీ చానల్ తరహాలోనే ఓ ప్రత్యేక చానల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒంగోలులో జరుగుతున్న బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు మాట్లాడుతూ, శివతత్వ ప్రచారం కోసం త్వరలోనే చానల్ తెస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ శివాలయాల ప్రతిష్ఠను తెలియజేసేలా చానల్ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News