: లంకతో వన్డే సిరీస్ నుంచి షమీ ఔట్... కులకర్ణికి చోటు
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ముంబయి మీడియం పేసర్ ధవళ్ కులకర్ణిని ఎంపిక చేసినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. షమీ కుడికాలి వేలి గాయంతో బాధపడుతున్నాడని, అతనికి పది రోజుల విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. కాగా, షమీ స్థానాన్ని భర్తీ చేస్తున్న కులకర్ణి ఈ ఏడాదే అంతర్జాతీయ వన్డే (ఇంగ్లండ్ పై) అరంగేట్రం చేశాడు. తాజాగా, దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.