: నల్లధనం కుబేరుల జాబితాపై 'డాబర్' స్పందన


నల్లధనం ఖాతాదారుల పేర్ల వెల్లడిలో భాగంగా ముగ్గురి పేర్లను కేంద్ర ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. అందులో డాబర్ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రదీప్ బర్మన్ పేరును పేర్కొనడాన్ని సదరు సంస్థ తిరస్కరించింది. "ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడే అతను ఖాతా ఓపెన్ చేశారు. చట్టబద్ధంగా ఈ ఖాతా తెరవడానికి అనుమతి ఉంది. మేము అన్ని చట్టాలను అనుసరించాము. ఖాతాకు సంబంధించిన అన్ని వివరాలు చట్టం ప్రకారం, ఆదాయపన్ను శాఖకు అనుగుణంగానే ఉన్నాయి. అంతేకాక సరైన క్రమంలోనే పన్నులు చెల్లిస్తున్నాము. కాబట్టి, విదేశీ ఖాతా ఉన్న ప్రతి వ్యక్తిపై అదే రంగు పులమడం దురదృష్టకరం" అని ప్రదీప్ బర్మన్ కు మద్దతిస్తూ డాబర్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. అటు మిగతా ఇద్దరు వ్యక్తులు కూడా తమ పేర్లు జాబితాలో ఉండటాన్ని తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News