: వాళ్లిద్దరూ దుర్ముహూర్తంలో ప్రమాణస్వీకారం చేశారు...అందుకే ఈ అనర్ధాలు!: స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు


శారదా పీఠాధిపతి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు దుర్ముహూర్తాల్లో ప్రమాణ స్వీకారం చేశారని పేర్కొన్నారు. తన జన్మదినం సందర్భంగా విశాఖలో ఆయన మాట్లాడుతూ, మోదీ, బాబు ప్రమాణస్వీకారం చేసిన వేళలు మంచివి కావని అన్నారు. అందుకే కాశ్మీర్ వరదలు, హుదూద్ తుపాను సంభవించాయని వివరించారు. సూర్యాస్తమయం అయిన తర్వాతే ప్రమాణం చేశారని, అందుకే ఈ వైపరీత్యాలు వస్తున్నాయని తెలిపారు. తాజాగా గుజరాత్ ను తుపాను తాకనుందని, అక్కడ జరిగే నష్టాలకు కూడా ఇదే కారణమని అన్నారు. మరో మూడేళ్ళపాటు ఈ విపత్తులు తప్పవని స్వరూపానంద హెచ్చరించారు.

  • Loading...

More Telugu News