: లిక్కర్ సిండికేట్ పై తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు


ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన లిక్కర్ సిండికేట్ కేసుకు సంబంధించిన విచారణపై హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ అనుమతికి సంబంధించి రెండు వారాల్లో అభిప్రాయం తెలపాలని సోమవారం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నాటి రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రమేయంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అంతేకాక అబ్కారీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు మీడియా ప్రతినిధుల ప్రమేయం ఉందంటూ పలు కథనాలు వెలుగు చూశాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ కేసు విచారణ కొంతకాలం పాటు నిలిచిపోయినా, తాజాగా ఊపందుకుంది.

  • Loading...

More Telugu News