: కిషన్ రెడ్డి తెలంగాణలో పుట్టాడా? లేక ఆంధ్రలో పుట్టాడా?: కేటీఆర్


బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై టీఎస్ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు కిషన్ రెడ్డి తెలంగాణలో పుట్టాడా? లేక ఆంధ్రలో పుట్టాడా? అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాసినా బీజేపీ ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ వారానికి రెండు రోజుల పాటు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తే మాత్రం కిషన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. బీజేపీ, టీడీపీలు కుమ్మక్కై టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టకుండా చంద్రబాబు బెదిరిస్తున్నారని... దీనిపై తెలంగాణకు చెందిన బీజేపీ, టీడీపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News