: ఏపీ, మహారాష్ట్ర, కేంద్రానికి సుప్రీం నోటీసులు
బాబ్లీ ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీలో తమకు స్థానం కల్పించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దానిని పరిశీలించిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. తెలంగాణ రాష్ట్రాన్ని కమిటీలో చేర్చుకోవడంపై అభ్యంతరాలుంటే నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ మూడు ప్రభుత్వాలను కోరింది.