: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడన ద్రోణి ప్రభావంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, గుంటూరు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గుండ్లకమ్మ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో, మాచర్ల-చీరాల మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు ప్రాంతంలో వాగులు పోటెత్తుతున్నాయి. కృష్ణా జిల్లాలోని విజయవాడ, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, మైలవరం ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.