: దావూద్ ను రహస్య ప్రాంతానికి తరలించిన పాక్


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అత్యంత రహస్య ప్రాంతానికి తరలించింది. పాక్ అండతో దావూద్ ఇబ్రహీం కరాచీలో సంపన్నులుండే క్లిఫ్టాన్ ప్రాంతంలో దర్జాగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ తో పాటు అమెరికా కూడా దావూద్ ను కనుగొనేందుకు నిఘాను పెంచిన నేపథ్యంలో ఐఎస్ఐ అతడిని అత్యంత రహస్య ప్రాంతానికి తరలించింది. పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దులోని సదరు ప్రాంతాన్ని ఇతర దేశాల నిఘా సంస్థలు గుర్తించడం కష్టమన్న భావనతోనే ఐఎస్ఐ అతడిని అక్కడికి తరలించింది.

  • Loading...

More Telugu News