: సత్తా చాటిన సానియా జోడీ...డబ్ల్యూటీఏ టైటిల్ ఖాతాలో జమ


సింగపూర్ లో జరిగిన డబ్ల్యూటీఏ మహిళల టెన్నిస్ టైటిల్ పోరులో సానియా మీర్జా, కారాబ్లాక్ జోడీ విజయం సాధించింది. ఈ సీజన్ లో విశేషంగా రాణించిన సానియా, కారా బ్లాక్ జోడీ టైటిల్ పోరులో రెండో సీడ్ క్రీడాకారిణులు సు వి సై (చైనీస్ తైపీ), షువయ్ పెంగ్ (చైనా)పై 6-1, 6-0 వరుస సెట్లలో విజయం సాధించారు. దీంతో టైటిల్ గెలుచుకున్నారు. ఈ విజయంతో సానియా, కారాల డబ్ల్యూటీఏ ర్యాంకులు మెరుగుపడనున్నాయి. ఈ ఏడాదిలో డబ్ల్యూటీఏ సీజన్ ముగియనుంది.

  • Loading...

More Telugu News