: ప్రధానితో సెల్ఫీల మోజు తీర్చుకున్న సెలబ్రెటీలు


సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా సినీ నటులతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి సినీ నటులు ఓ వ్యక్తితో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపి, తమ మోజు తీర్చుకున్నారు. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానితో సెల్ఫీలు దిగేందుకు పలువురు సినీ సెలబ్రెటీలు ఆసక్తి చూపారు. సోనమ్ కపూర్, శ్రద్ధా కపూర్, ఆదిత్యారాయ్ కపూర్, సోనూ నిగమ్ లు మోడీతో సెల్ఫీలు దిగి ట్విట్టర్లో పోస్టులు పెట్టారు.

  • Loading...

More Telugu News