: ఆమె పాలిట రెండు ప్రమాదాలు!
వరుసగా జరిగిన రెండు ప్రమాదాలు ఆమె ప్రాణాలు తీసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు వద్ద ఓ మహిళ ప్రయాణిస్తున్న ఆటోలోంచి ప్రమాదవశాత్తు జారి రోడ్డు మీద పడింది. ఇంతలో వెనుకగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఆమె తలను బలంగా తాకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనిని చూసిన ఆటోలోని ప్రయాణీకులు షాక్ కు గురయ్యారు.