: తల్లి అంత్యక్రియలకు వెళుతూ... ఎద్దువాగు ప్రవాహంలో ఇద్దరు మహిళల గల్లంతు


తల్లి అంత్యక్రియల కోసం వెళుతున్న ఇద్దరు మహిళలను ఎద్దువాగు ప్రవాహం పొట్టనబెట్టుకుంది. శనివారం గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియలకు వెళుతున్న అనసూయ, రాధ అనే ఇద్దరు మహిళలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరిలో ఓ మహిళ మృతదేహం లభించగా, మరో మహిళ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గుంటూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి.

  • Loading...

More Telugu News