: బ్రాండ్ ఇమేజ్ లో ఫేస్ బుక్ భారీ జంప్!


సోషల్ నెట్ వర్కింగ్ లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఫేస్ బుక్, తన బ్రాండ్ ఇమేజీని కూడా భారీ ఎత్తున పెంచేసుకుంటూ వస్తోంది. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘ఇంటర్ బ్రాండ్’ సంస్థ ఇటీవల ‘2014 బెస్ట్ గ్లోబల్ బ్రాండ్స్’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఒకేసారి 23 స్థానాలను మెరుగుపరచుకున్న ఫేస్ బుక్ 29వ స్థానంలో నిలిచింది. ఇక ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్, ఈ జాబితాలో తొలి స్థానంలో నిలవగా, గూగుల్ రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ నాలుగో స్థానంలో నిలిచాయి. మొన్నటిదాకా 12 ఏళ్లుగా ఈ జాబితాలో అగ్రభాగాన కొనసాగుతూ వచ్చిన కోకా-కోలా గతేడాది మూడో స్థానంలోకి దిగిపోయింది. రెండేళ్లుగా గూగుల్, తన తొలి స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది.

  • Loading...

More Telugu News