: రక్షణ శాఖకు 80 వేల కోట్లు మంజూరు
రక్షణ శాఖ ప్రాజెక్టుల కోసం 80 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన రక్షణ మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం నుంచి 50 వేల కోట్ల రూపాయలను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయనున్న ఆరు జలంతర్గాముల కోసం వినియోగించనున్నారు. వీటితో పాటు 8 వేల కోట్ల రూపాయలను ఇజ్రాయెల్ యాంటీ ట్యాంక్ క్షిపణులు, 12 అధునాతన డోర్నియర్ నిఘా ఎయిర్ క్రాఫ్ట్ లను రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది.