: సామర్ధ్యం ఉంది... మనం వైద్యపరికరాలు తయారు చేసుకోలేమా?: మోదీ
శాస్త్ర, సాంకేతిక విద్యలో అపార సామర్ధ్యమున్నప్పటికీ మనం వైద్యపరికరాలు తయారు చేసుకోలేకపోవడం తనను అసంతృప్తికి గురిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ముంబైలో హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య రంగంలో వస్తున్న మార్పులను ఆకళింపుచేసుకుంటూ సమస్యలు అధిగమించాలని ఆకాంక్షించారు. దేశంలో శిశుమరణాలు ఆందోళన కలిగిస్తున్నాయన్న ఆయన, వైద్య పరికరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అభిప్రాయపడ్డారు. టెలిమెడిసిన్ విధానం ఇప్పటికీ సాధారణ ప్రజానీకానికి అందని ద్రాక్షగానే ఉందని ఆయన పేర్కొన్నారు. సురక్షిత త్రాగునీరు అందుబాటులో ఉంచితే ప్రజలను అంటు రోగాల నుంచి రక్షించవచ్చని ఆయన స్పష్టం చేశారు.