: పనీపాటా లేకుండా విమర్శించడం కాదు...బాబును చూసి నేర్చుకోండి: గంటా


అధికారం చేపట్టి ఐదు నెలలు పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పలేని దుస్థితిలో ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎంత సేపూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మంత్రులను చూసి ఏడవడం కాకుండా పని చేయడం కూడా నేర్చుకోవాలని తెలంగాణ నేతలకు హితవు పలికారు. రోజుకి 18 గంటలు కష్టపడుతున్న చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలడం మానేసి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు పని చేయడం మొదలు పెట్టాలని ఆయన సూచించారు. పనీపాటా మానేసి ప్రజలను మభ్యపెడుతూ కూర్చుంటే ఏదో ఒకరోజు ముసుగులు తొలగిపోతాయని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News