: గూగుల్ కీలక విభాగాలకు సుందర్ పిచాయ్ నేతృత్వం!
భారత సంతతి ప్రతిభావంతుల్లో ఒకరుగా పేరుగాంచిన సుందర్ పిచాయ్ కు గూగుల్ మరింత గురుతర బాధ్యతలను అప్పజెప్పింది. గూగుల్ లో కీలక విభాగాలైన సెర్చ్ మ్యాప్స్, గూగుల్ ప్లస్, కామర్స్, అడ్వర్టైజింగ్, మౌలిక వసతుల విభాగాల బాధ్యతలను అప్పజెపుతూ ఆ సంస్థ సీఈఓ ల్యారీ పేజ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గూగుల్ లో సుందర్ పిచాయ్ కీలక వ్యక్తిగా అవతరించారు. ఇప్పటికే గూగుల్ వృద్ధిలో కీలక భూమిక పోషించిన సుందర్ పిచాయ్ కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా తన తర్వాతి స్థానం పిచాయ్ దేనని ల్యారీ పేజ్ చెప్పకనే చెప్పారు.