: జమ్మూకాశ్మీర్ కు నేడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
భారీ వరదల నుంచి కోలుకుంటున్న జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు నేడు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ అధికారులు ప్రకటించనున్నారు. రెండు రోజుల కిందట ఈసీ అధికారులు ఆ రాష్ట్రంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఓ అంచనాకు వచ్చిన ఈసీ... ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది.