: హైదరాబాద్ లో ఉన్న మా పెట్టుబడుల మాటేంటి?: కేసీఆర్ కు సోమిరెడ్డి ప్రశ్న
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం విరుచుకుపడ్డారు. కృష్ణపట్నంలో తమ పెట్టుబడులున్నాయని చెబుతున్న కేసీఆర్, హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రుల పెట్టుబడులపై మాట్లాడరెందుకని ప్రశ్నించారు. కృష్ణపట్నంలో వాటా కోరే కేసీఆర్, హైదరాబాద్ లో ఆదాయాన్ని సీమాంధ్రకు పంచి ఇస్తారా? అని ప్రశ్నించారు. విద్యుదుత్పత్తి విషయంలో సుప్రీంకోర్టుకు వెళతానంటున్న కేసీఆర్ ను తామేమీ ఆపడం లేదని ఈ సందర్భంగా సోమిరెడ్డి అన్నారు.