: కేసీఆర్ నిర్వాకంతోనే తెలంగాణకు కష్టాలు: ఏపీ హోంమంత్రి
కేవలం కేసీఆర్ నిర్వాకం వల్లే తెలంగాణ ప్రజలు కష్టాలను చవిచూస్తున్నారని ఏపీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. శ్రీశైలం అంశంపై కేసీఆర్ తో బహిరంగ చర్చకు ఏపీ ప్రభుత్వం సిద్ధమని తెలిపారు. ఈ ఉదయం కడప జిల్లా ప్రొద్దుటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ముఖ్యమంత్రి ముందు చూపుతో విద్యుత్ సమస్యను తాము అధిగమించగలిగామని చెప్పారు. కేసీఆర్ ముందుచూపు లేనితనం, అసమర్థత కారణంగా తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకుందని అన్నారు.