: ముద్దు పెట్టినందుకు 8 నెలల జైలు శిక్ష


విమానంలో తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎన్నారై దేవేందర్ సింగ్ (62)కు అమెరికా కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది. గత సెప్టెంబర్ లో దేవేందర్ సింగ్ హ్యూస్టన్ నుంచి నెవార్క్ కు విమానంలో ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యంలో తన పక్క సీటులో ఉన్న మహిళకు ముద్దుపెట్టాడు. అనంతరం లైంగిక దాడికి యత్నించబోయాడు. దీంతో, నిద్ర నుంచి మేల్కొన్న సదరు మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అనంతరం, విమానం ల్యాండ్ అవగానే దేవేందర్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించిన కోర్టు దేవేందర్ కు నిన్న శిక్షను ఖరారు చేసింది. దేవేందర్ సింగ్ లూసియానాలో నివసిస్తున్నాడు.

  • Loading...

More Telugu News