: కావేరి ఎక్స్ ప్రెస్ ను గంటసేపు నిలిపేసిన గజరాజులు
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని పచ్చూరు, మల్లానూరు ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పై తిష్ట వేశాయి. దీంతో, మైసూరు నుంచి చెన్నై వెళుతున్న కావేరి ఎక్స్ ప్రెస్ గంటసేపు నిలిచిపోయింది. అంతేకాకుండా, కూసూరు, పులిగుండు, పత్తిచేను మండలాల్లోని పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. రామకుప్పం మండలం పాలరేవుగడ్డ, కుర్లపల్లి, బల్ల గ్రామాల్లోని రోడ్లపై ఇవి తిరుగుతున్నాయి. దీంతో, కుప్పం-వీర్నమల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.