: శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఎట్టి పరిస్థితుల్లో ఆపివేయమని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం... మాటకు కట్టుబడే ఉంది. సమస్య కృష్ణా రివర్ బోర్డు దృష్టికి వెళ్లినప్పటికీ... విద్యుత్ ఉత్పత్తిని మాత్రం కొనసాగిస్తూనే ఉంది. తెలంగాణ పరిధిలోకి వచ్చే లెఫ్ట్ పవర్ హౌస్ లో ఉత్పత్తి కొనసాగుతోంది. 125 మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.