: పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన భూమా నాగిరెడ్డి
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ కు వైకాపా నేత భూమా నాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు పవన్ కల్యాణ్ కృషి చేశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని పోటీకి దింపకుండా చంద్రబాబుతో కల్యాణ్ మాట్లాడినట్టు గతంలోనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. భూమా నాగిరెడ్డి వ్యాఖ్యలతో ఆ వార్తలు నిజమేనని తేలిపోయింది. మరోవైపు, ఈ విజయాన్ని తన తల్లి శోభా నాగిరెడ్డికి అంకితమిస్తున్నానని అఖిల ప్రియ తెలిపారు.