: మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి అప్పగించిన ఒబామా
అమెరికా పాలనా వ్యవహారాల్లో భారత సంతతి వ్యక్తుల ప్రాబల్యం రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా, స్వీడన్ లో అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన అజిత రాజిని అధ్యక్షుడు ఒబామా నామినేట్ చేశారు. 2012లో ఒబామా అధ్యక్ష ప్రచారానికి గాను 5 లక్షల డాలర్లను సమకూర్చడంలో అజిత కీలక పాత్ర వహించారు. అప్పట్లో అధ్యక్ష ప్రచారానికి సంబంధించిన ఫైనాన్స్ విభాగం ఛైర్మన్ గా ఆమె పనిచేశారు. ఆమె కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు.