: టీడీపీ కార్యాలయాలపై దాడి వెనుక జూపల్లి హ్యాండ్?


తెలంగాణలోని టీడీపీ కార్యాలయాలపై దాడుల వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హస్తం ఉందని టీటీడీపీ కీలక నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపిస్తున్నారు. జూపల్లితో పాటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా దీనికి బాధ్యుడే అని అన్నారు. జగదీశ్వర్ రెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఆందోళనలు చేయాలని జూపల్లి టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎస్ఎంఎస్ లు పంపించారని ఆరోపించారు. జూపల్లిపై చర్యలు తీసుకోకపోతే తాము కోర్టుకు వెళతామని ఎర్రబెల్లి హెచ్చరించారు. కేసీఆర్ ఒక అసమర్థుడని... ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు, మోదీలపై టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News