: దీక్ష విరమించిన నిర్మాత రామకృష్ణగౌడ్
హైదరాబాదులో నిర్మాత రామకృష్ణగౌడ్ దీక్ష విరమించారు. థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ, గౌడ్ గత ఏడు రోజులుగా ఫిలిం చాంబర్ వద్ద దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతుగా కొందరు ఫిలిం చాంబర్ ను ముట్టడించి, అద్దాలు ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో, ఈ అంశంలో జోక్యం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి నిర్మాత రామకృష్ణ గౌడ్ కు సర్దిచెప్పారు. దీంతో, గౌడ్ దీక్ష విరమించారు.