: అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం... నామినేషన్లు ఉపసంహరించుకున్న మిగిలిన ఇద్దరు
ఆళ్ళగడ్డ ఉపఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అఖిల ప్రియ ఒక్కరే బరిలో మిగిలారు. మొత్తం ఏడు నామినేషన్లు దాఖలవగా, వాటిలో నాలుగింటిని అధికారులు తిరస్కరించారు. దీంతో, అఖిల ప్రియతో పాటు మరో ఇద్దరు స్వతంత్రులు బరిలో మిగిలారు. ఇప్పుడు వారిద్దరూ వెనక్కి తగ్గడంతో అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించాల్సి ఉంది.