: బిలియనీర్లను తయారు చేసిన విద్యాలయాల్లో ముంబై వర్సిటీకి తొమ్మిదో స్థానం


ప్రపంచంలోనే అత్యధిక మంది బిలియనీర్లను తయారు చేసిన ప్రతిష్ఠాత్మక వర్సిటీల జాబితాలో ముంబై వర్సిటీ తొమ్మిదో స్థానంలో నిలిచింది. వెల్త్ - ఎక్స్, యూబీఎస్ బిలియనీర్స్ సెన్సస్ గురువారం విడుదల చేసిన ఈ జాబితాలో ముంబై వర్సిటీ... మసాచుసెట్స్, మిచిగాన్, కొలొంబియా వర్సిటీల కంటే మెరుగైన స్థానంలో నిలవడం గమనార్హం. జాబితాలో మొత్తం 20 వర్సిటీల్లో 16 వర్సిటీలు అమెరికాకు చెందినవే. ముంబై వర్సిటీలో విద్యనభ్యసించిన వారిలో ఇప్పటికీ 12 మంది బిలియనీర్లుగా కొనసాగుతున్నారు. 25 మంది బిలియనీర్లతో పెన్సిల్వేనియా వర్సిటీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, 22 మంది బిలియనీర్లతో హార్వర్డ్ వర్సిటీ రెండో స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News