: సాగర్ వద్ద తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి... శ్రీశైలంలోనూ కొనసాగిస్తామన్న హరీశ్
తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు కొంతమేర తీరనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ లో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. అటు, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుదుత్పత్తి కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రాజెక్టు నీటిలో విద్యుదుత్పత్తికి ఉన్న కేటాయింపుల ప్రకారమే తమ ప్రభుత్వం నడుచుకుంటోందని తెలిపారు. ఈ విషయంలో ఏపీ సర్కారు అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కేటాయింపులకు మించి నీటిని మళ్ళించుకుంటోంది వారేనని హరీశ్ రావు ఆరోపించారు. విద్యుత్ అంశంలో చంద్రబాబు చెప్పేవన్నీ అవాస్తవాలేనని అన్నారు. మరోవైపు, శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి సందర్బంగా తాము ఉల్లంఘనలకు పాల్పడడం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలాచారి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి, జలవనరుల శాఖ మంత్రికి లేఖలు రాశారు.