: 'పీకే' టీజర్ విడుదల చేసిన అమీర్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన తాజా చిత్రం 'పీకే' టీజర్ ను విడుదల చేశాడు. ఈ సినిమా హిట్టవ్వాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. గురువారం నాడు ముంబయిలో జరిగిన టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ 'మిస్టర్ పర్ఫెక్షనిస్ట్' మాట్లాడుతూ, తన సినిమాలు ఎక్కువగా క్రిస్మస్ కు విడుదలవడం కాకతాళీయమని అన్నాడు. రాజ్ కుమార్ హిరానీ చిత్రాలన్నింటిలానే 'పీకే' కూడా గట్టి సందేశం ఇస్తుందని చెప్పాడు. ఈ సినిమాలోని పాత్ర తన కెరీర్లోకెల్లా అత్యంత క్లిష్టమైనదని పేర్కొన్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అమీర్ తో పాటు అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలు పోషించారు.