: సైనికులతో మోదీ ఆత్మీయ వచనాలు
ప్రధాని నరేంద్ర మోదీ సియాచిన్ లో సైనికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానిగా తొలి దీపావళి సైనికులతో జరుపుకునేందుకు వచ్చానని తెలిపారు. సైన్యం సేవల ఫలితమే ప్రజలంతా దీపావళి జరుపుకుంటున్నారని కీర్తించారు. దేశం సైన్యం భుజస్కంధాలపై ఉందని అన్నారు. సైనికుల కలలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.