: సెటిల్మెంట్ల బాట పట్టిన లెక్చరర్ అరెస్టు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ లెక్చరర్ పెడతోవ పట్టాడు. ఏలూరుకు చెందిన గౌస్ మొహిద్దీన్ అనే లెక్చరర్ తనకు అధికారులతో పరిచయాలున్నాయంటూ సెటిల్మెంట్లకు పాల్పడ్డాడు. అంతేగాకుండా, పోలీస్ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ పలువురిని మోసం చేశాడు. ఒంగోలుకు చెందిన సూర్యప్రకాశరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు గౌస్ మొహద్దీన్ ను ఏలూరు టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. గతరాత్రి నుంచి అతని నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.