: శిక్ష తప్పించుకోవడానికి కోమా డ్రామాకు తెరదీశాడు!


లండన్ లో అలెన్ నైట్ అనే వ్యక్తి శిక్ష తప్పించుకోవడానికి ఎలాంటి ఎత్తు వేశాడో చూడండి. రెండేళ్ళ పాటు కోమాలో ఉన్నట్టు నటించి, చివరికి పోలీసులకు దొరికిపోయాడు. పక్కంటి వ్యక్తికి చెందిన బ్యాంక్ అకౌంట్ నుంచి 40వేల పౌండ్లను తన అకౌంట్ లోకి మళ్ళించుకున్నాడన్న నేరంపై పోలీసులు విచారణ ఆరంభించారు. దీంతో, శిక్ష తప్పించుకోవడానికి ఓ పథకం వేశాడు. విచారణ మొదలైందో, లేదో... పక్షవాతం వచ్చినట్టు, తరచూ కోమాలోకి వెళుతున్నట్టు డ్రామాకు తెరలేపాడు. ఈ తంతు రెండేళ్ళపాటు సాగింది. మధ్యలో ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటూ అందరినీ నమ్మించడానికి శతధా ప్రయత్నించేవాడు. అయితే, ఓ సూపర్ మార్కెట్ సీసీటీవీ ఫుటేజి అలెన్ ను పోలీసులకు పట్టించింది. అలెన్ ఉపయోగించిన సూపర్ మార్కెట్ కార్డు అతని ఆచూకీ తెలిపింది. దీంతో, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం నవంబర్ 7న అతడికి శిక్ష ఖరారు చేయనుంది.

  • Loading...

More Telugu News