: రేడియోలో నవంబర్ 2న మోదీ 'మన్ కీ బాత్'!


ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' మరోమారు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం కానుంది. ఇప్పటికే 'స్వచ్ఛ్ భారత్ అభియాన్'పై రేడియోలో ప్రసంగించిన ప్రధాని, నవంబర్ 2న మరోమారు రేడియో ద్వారా ప్రజలతో మాట్లాడనున్నారు. ఈ దఫా మన్ కీ బాత్ లో సుపరిపాలపై మోదీ మాట్లాడనున్నారని సమాచారం. కార్యక్రమంలో భాగంగా సుపరిపాలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు చేయాలని ఆయన దేశ ప్రజలను కోరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News