: ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా విశాఖ: చంద్రబాబు
విశాఖ నగరాన్ని ప్రపంచంలోనే అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. సంకల్పం, పట్టుదల ఉంటే, ఏమైనా సాధించే సత్తా తెలుగు ప్రజలకు ఉందని, వారి సహకారంతోనే విశాఖను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని ఆయన బుధవారం ఆత్మవిశ్వాస ర్యాలీలో భాగంగా పేర్కొన్నారు. హుదూద్ తుపానే అసూయ పడేలా నగరాన్ని తీర్చిదిద్దుదామని, ఇందులో ప్రజలు కూడా సంపూర్ణ సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖను పురోభివృద్ధి బాటలో నడిపించేందుకు కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీని మరిపించేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని, అప్పటిదాకా నిద్రపోనని ఆయన శపథం చేశారు.