: కెనడా పార్లమెంట్ సమీపంలో కాల్పులు... పార్లమెంట్ మూసివేత
కెనడా రాజధాని అట్టావాలోని పార్లమెంట్ సమీపంలో బుధవారం ఓ ఆగంతుకుడు ఆ దేశ సైనికుడిపై కాల్పులకు దిగాడు. ఆ తర్వాత సదరు దుండగుడు పార్లమెంట్ భవన సముదాయం వైపు చొచ్చుకెళ్లాడు. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కాల్పుల నేపథ్యంలో పార్లమెంట్ ను మూసివేశారు. రెండు రోజుల క్రితం ఇస్లామిక్ మిలిటెంట్ గా భావిస్తున్న ఓ దుండగుడు కెనడా నగరం మాంట్రియాల్ లో ఇద్దరు సైనికులపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఓ సైనికుడు మరణించాడు.