: చంద్రబాబు పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయి: వైఎస్సార్సీపీ
చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎస్సీలపై దాడులు పెరిగిపోయాయని వైఎస్సార్సీపీ ఆరోపించింది. గడచిన ఎన్నికల్లో తమకు ఓటేసిన వారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని ఆ పార్టీ నేత మేరుగ నాగార్జున ఆరోపించారు. ఈ మేరకు ఆయన బుధవారం అనంతపురం జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లాలో జేసీ సోదరుల ఆధ్వర్యంలో జరుగుతున్న హత్యాకాండను ఆపాలని ఈ సందర్భంగా ఆయన ఎస్పీకి విన్నవించారు.